బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ
కడప: నగరంలోని కనుమలోపల్లె వద్ద ఆర్టీసీ స్టేజీ ఏర్పాటు చేసినా బస్సులు నిలపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. కనుమలోపల్లెలో ఆధ్యాత్మిక ఆలయాలు చాలా ఉన్నాయి. కడప, భాకరాపేట, నందలూరు ఒంటిమిట్ట తదితర గ్రామాల నుంచి భక్తులు వస్తుంటారు. గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.