VIDEO: 'సొంతిల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి'

KMM: సొంతిల్లు లేని అర్హులైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని చింతకాని మండలం BJP అధ్యక్షుడు కొండ గోపి అన్నారు. శనివారం ప్రజా సమస్యలపై మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మండలానికి కొత్త అంబులెన్స్ కేటాయించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.