కుక్కల దాడిలో గొర్రెల మృతి

MHBD: కురవి మండలం మోదుగులగూడెంలో రసాల లింగయ్య అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రెల మందపై సోమవారం వీధికుక్కలు దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయి. దీంతో గొర్రెల కాపరికి రూ. 2 లక్షల మేర ఆస్థి నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని తెలిపారు.