అధికారుల తీరుపై రైతు తీవ్ర అసహనం
KRNL: ఆదోని మండలం మదిరే గ్రామానికి చెందిన డి. తిమ్మప్ప రెవెన్యూ, వ్యవసాయ అధికారులపై మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం కింద నగదు జమ కాలేదని, అధికారుల చుట్టూ 6 నెలలుగా తిరుగుతున్నా స్పందన లేదన్నారు. పలుసార్లు అర్జీలు ఇచ్చానని, అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. సీఎం చంద్రబాబు స్పందించి న్యాయం చేయాలని కోరారు.