మండల ప్రజావాణిలో రెండు ఫిర్యాదులు
GDWL: క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రతి అర్జీని త్వరితగతిన పరిశీలించి న్యాయం చేస్తాం అని గట్టు మండల అధికారులు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి 2 వినతులు అందాయి. గట్టు 12వ వార్డులో తాగునీటి సమస్య, గట్టులో ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదు వచ్చినట్లు కార్యాలయం సిబ్బంది తెలిపారు.