'ఓటు వేయకుంటే చావుతో సమానం'

'ఓటు వేయకుంటే చావుతో సమానం'

TG: నాగర్‌కర్నూల్ (D) వెల్దండ (M) రాచూరు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు లక్ష్మమ్మ(104) పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తాను ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయకుండా ఉండలేదని తెలిపారు. 'ఓటు హక్కు మన జన్మ హక్కు. ఓటు వేస్తేనే మనం బతికి ఉన్నట్లు. ఓటు వేయకపోతే అది చావుతో సమానం' అని పేర్కొన్నారు. కాగా, నేటి యువతకు లక్ష్మమ్మ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.