'భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు కేటాయించాలి'
SDPT: ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ యార్డ్‌లో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే 250 గజాల ప్లాట్లు కేటాయించాలని బీఆర్‌ఎస్ గజ్వేల్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్లాట్లు ఇవ్వకుండా నిర్మాణాలు చేపడితే రహదారుల దిగ్బంధం, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. డీపీఆర్ లేకుండా పనులు ప్రారంభించవద్దని ప్రభుత్వాన్ని కోరారు.