9 గంటల వరకు పోలింగ్ శాతం
KNR: జిల్లాలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి 15.87 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. కాగా, తొలి విడతలో భాగంగా మొత్తం 92 పంచాయతీల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.