'మహిళలంతా సుఖ సంతోషాలతో ఉండాలి'

MBNR: ప్రజలు రక్షాబంధన్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కాంక్షించారు. శనివారం రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ఆయన సోదర గీత మాజీ ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి తమ అధికారంలో ఉండగా ఎంతో కృషి చేశామని వెల్లడించారు. మహిళలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.