రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

CTR: పుంగనూరు మండలం భీమ గాని పల్లి సమీపాన జాతీయ రహదారిపై ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పట్రపల్లికి చెందిన సుబ్బన్న మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.