పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
JN: పడమటి కేశవాపూర్ గ్రామంలోని పాఠశాలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని, విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని, పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యను అందించాలని ఎమ్మెల్యే అన్నారు.