తణుకు జాతీయ రహదారిపై బోల్తా కొట్టిన వాహనం

తణుకు జాతీయ రహదారిపై బోల్తా కొట్టిన వాహనం

W.G: తణుకు హైవేపై ఉండ్రాజవరం జంక్షన్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం నుంచి రావులపాలెం వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జంక్షన్ వద్ద నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాపోతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.