'లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందించాలి'

SRD: గిరిజన తండాలో కొత్తగా నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లకు అధికారులు సకాలంలో బిల్లులు అందజేయాలని సామాజిక సేవాకర్త కర్ర రాములు చౌహాన్ శుక్రవారం అన్నారు. ఖేడ్ మండలం వెంకటాపూర్ తండాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన నాలుగురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 సిమెంట్ బస్తాలు చొప్పున ఆయన స్వచ్ఛందంగా అందజేశారు. మంచి నాణ్యతతో సకాలంలో ఇళ్లు నిర్మించుకోవాలని కోరారు.