'మార్కెట్ తరలింపుపై దుష్ప్రచారం వద్దు'

GNTR: కొల్లి శారదా కూరగాయల మార్కెట్ తరలిస్తున్నట్లు వస్తున్న పుకార్లు నమ్మొద్దని మేయర్ రవీంద్ర, కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. కొన్ని వ్యాపార సంఘాలు వ్యాపారస్తులకు అసత్య ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బుధవారం తెలిపారు. 81 షాపులకు 25 సంవత్సరాలు లీజు గడువు ముగిసిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈ నెల 18 నుంచి 20వ వరకు బహిరంగ వేలం ఉంటుందన్నారు.