ర్యాలి జగన్మోహిని కేశవ స్వామిని దర్శించిన ఎక్సైజ్ డిఎస్పీ

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహిని కేశవ స్వామిని రాజమండ్రి ఎక్సైజ్ డిపార్టుమెంటు డీఎస్పీ వినీష గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు.