రేపు కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు
కర్నూలు నగరంలో రంజాన్ సందర్భంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రార్థనలు ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులను తిప్పమ్మకొట్టం వద్ద హైవేపైకి మళ్లిస్తారు. బళ్లారి చౌరస్తా, బిర్లా జంక్షన్, సీ క్యాంపు మార్గాల్లోనూ డైవర్షన్ అమలు చేస్తారని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.