400 లీటర్ల బెల్లపు ఊటలు ధ్వంసం

400 లీటర్ల బెల్లపు ఊటలు ధ్వంసం

SKLM: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా సోంపేట, ఇచ్ఛాపురం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిబ్బంది మందస మండలం పట్టులోగాం గ్రామంలో దాడులు నిర్వహించి 400 లీటర్ల బెల్లపు ఊటలు, 8 పొయ్యలను ధ్వంసం చేసినట్లు సోంపేట ఎక్సైజ్ సీఐ కె.బేబీ తెలిపారు. అదేవిధంగా సోంపేట మండలం కొరంజి భద్ర గ్రామంలో 80 లీటర్ల నాటు సారాను సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.