'సంక్షేమ పథకాలే ప్రభుత్వ లక్ష్యం'
MBNR: ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కే అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భూత్పూర్ మున్సిపాలిటీలో 'ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక'ను ప్రారంభించిన ఆయన, స్వయంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి రోడ్లపై మట్టిని తొలగించి శుభ్రం చేశారు. ప్రతి అధికారి ప్రజలకు చేరువగా ఉండి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.