ఆర్ఎంపీలపై తనిఖీలు నిలపాలని ఎమ్మెల్యేకు వినతి

ఆర్ఎంపీలపై తనిఖీలు నిలపాలని ఎమ్మెల్యేకు వినతి

SS: పుట్టపర్తి నియోజకవర్గంలో RMP డాక్టర్లపై జిల్లా అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలను నిలిపివేయాలని వైద్యులు MLA పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని కోరారు. తనిఖీల పేరుతో క్లినిక్‌లు మూసివేయిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు.