'నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి'
NZB: సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి 27 అర్జీలను సీపీ సాయి చైతన్య స్వీకరించారు. సీపీ మాట్లాడుతూ.. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల SI, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా తమ సమస్యల కోసం సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.