VIDEO: కార్తీక పౌర్ణమి వేళ క్షుద్ర పూజలు కలకలం
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కార్తీక పౌర్ణమి రాత్రి శివారులో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించడంతో స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్థులు పూజాసామగ్రి, నిమ్మకాయలు, బొమ్మలు, ఎర్రటి పొడి, జుట్టు వంటి వస్తువులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు. స్థానికులు భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.