భక్తిశ్రద్ధలతో తిరుప్పావడ సేవ

భక్తిశ్రద్ధలతో తిరుప్పావడ సేవ

VZM: శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దశమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీవారి సుప్రభాత సేవ, నిత్య ఆరాధన, బాలభోగ నివేదన, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు. అనంతరం శ్రీవారి తిరుప్పావడ సేవ, అన్న కుటోత్సవం భక్తిశ్రద్ధలతో గావించారు.