పాత సంతకాలతో 36 నోటరీలు స్వాధీనం

పాత సంతకాలతో 36 నోటరీలు స్వాధీనం

KMM: ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం సమీపాన ఓ మహిళ నిర్వహిస్తున్న జిరాక్స్, ఆన్లైన్ సెంటర్లో శనివారం టూటౌన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేపట్టారు. ఆమె వద్దకు నోటరీ కోసం వచ్చే వారిని విచారించకుండానే పాత సంతకాలతో కూడిన పత్రాలు విక్రయిస్తుందనే ఫిర్యాదులు అందాయని సమాచారం. దీంతో తనిఖీ చేపట్టి 36 నోటరీలను స్వాధీనం చేసుకున్నామని CI బాలకృష్ణ తెలిపారు.