కార్యకర్త మృతికి మాజీ ఎమ్మెల్యే నివాళులు

కార్యకర్త మృతికి మాజీ ఎమ్మెల్యే నివాళులు

NDL: బనగానపల్లె మండలం మిట్టపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోమవారం పర్యటించారు. గ్రామ వైసీపీ నాయకుడు కాటసాని పుల్లారెడ్డి అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పుల్లారెడ్డి మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.