అనుమానంతో స్నేహితుడిని దారుణ హత్య
ELR: అనుమానంతో స్నేహితున్ని హత్య చేసిన ఘటన శుక్రవారం చోటచేసుకుంది. తణుకు శివారులో ఉన్న డ్రైవర్స్ కాలనీలో స్నేహితులు శిరాళం ప్రభాకర్, కందుల శ్రీను నివాసముంటున్నారు. బంధువైన మహిళతో ప్రభాకర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భావించిన శ్రీను కోపంతో రాత్రి అతడిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో మృతి చేందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమేదు చేశారు.