వెదురు డిపోలో 'లెక్కల' మాయాజాలం!

వెదురు డిపోలో 'లెక్కల' మాయాజాలం!

ASR: మారేడుమిల్లి వెదురు టింబర్ డిపోలో జరుగుతున్న అవినీతిపై బుధవారం స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కల్లో మాయాజాలం చేస్తూ అక్రమంగా వెదురు తరలిస్తున్నారని ఆరోపించారు. గతంలో లారీలు పట్టుబడ్డా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గిరిజన ఉపాధిని దెబ్బతీస్తున్న ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూన్నారు.