నేడు ఏపీ లిక్కర్ కేసుపై హైకోర్టు విచారణ
NTR: నేడు ఏపీ లిక్కర్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో మదనపల్లే జైలులో రీమాండ్ ఖైదీలుగా ఉన్నా చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు, నవీన్, బాలాజీ యాదవ్, మాజీ మంత్రీ జోగి రమేష్‌ను అధికారులు విజయవాడకు తరలించారు. ఈరోజు నిందితుల బైయిల్ పిటిషన్లు, జోగి రమేష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలలో ఉత్కంఠ నెలకొంది.