రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
SRPT: చివ్వెంల మండలం వల్లభాపురం వద్ద జరిగిన వాహన ప్రమాద స్థలాన్ని ఎస్పీ కే.నరసింహ పరిశీలించారు. అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించాలని సూచించారు. రహదారి లోపాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీటు బెల్టు ధరించడం, నిబంధనలు పాటించడం ద్వారానే ప్రమాదాల నివారణ సాధ్యమని అన్నారు.