జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌కు 124 మంది ఎంపిక

SRD: 2024-25 సంవత్సరానికి జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ మనక్‌కు 124 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు 10 వేల రూపాయలు చొప్పున వారి ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ప్రాజెక్టులు తయారు చేయాలని సూచించారు.