బయటి కంటే ఇంట్లో తిండే ఎంతో మేలు!

బయటి కంటే ఇంట్లో తిండే ఎంతో మేలు!

బయటి తిండి కన్నా ఇంట్లో వండుకునే ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బుల వంటి సమస్యల ముప్పు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా బారినపడటాన్ని తగ్గిస్తున్నట్టు తాజాగా బయటపడింది. ఆహారం, శారీరక శ్రమ వంటి జీవనశైలిని మార్చుకోవటం ద్వారా డిమెన్షియా కేసులు 40% వరకూ తగ్గుతున్నాయట.