అంగన్వాడీ కార్యకర్తలకు 5జీ ఫోన్‌లు పంపిణీ

అంగన్వాడీ కార్యకర్తలకు 5జీ ఫోన్‌లు పంపిణీ

ATP: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు 5జీ మొబైల్ ఫోన్‌ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఫోన్‌లను పంపిణీ చేశారు. చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలలోని 169 అంగన్వాడీ కార్యకర్తలు, ఇద్దరు సూపర్వైజర్లకు ఆమె సెల్ ఫోన్‌లు అందించారు.