ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే కఠిన చర్యలు

WNP: నిషేధిత ప్లాస్టిక్ విక్రయించే, వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలో విస్తృతంగా పర్యటించి పలు దుకాణాలను తనిఖీ చేశారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న పలుషాపు యజమానులకు జరిమానాలు విధించారు.