నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

కృష్ణా: ఉంగుటూరు సెక్షన్ పరిధిలోని నందమూరు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో ఇందుపల్లి AGL ఫీడర్‌పై PMI పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నందమూరు, మధిరపాడు, ఇందుపల్లి, వెల్దిపాడు, ఎలుకపాడు గ్రామాలకు అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.