డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఎస్ఐ

PDPL: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుదామని పొత్కపల్లి ఎస్ఐ రమేష్ పిలుపునిచ్చారు. శనివారం ఓదెల మండలం పొత్కపల్లిలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజం కోసం చర్యలు తీసుకుంటుందన్నారు.