సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క

మహబూబాబాద్: జిల్లాలోని ములుగు నియోజకవర్గం కొత్తగూడ మండలం గాంధీనగర్, పోలారం గ్రామాలలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.