ఎస్సై పదోన్నతి పరీక్షలు ముగింపు
విశాఖ రేంజ్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్స్, ASIలకు ఎస్సై ఎంపిక పరీక్షలు బుధవారం ముగిశాయి. కైలాసగిరిలో ఐజీ గోపినాథ్ జట్టి పర్యవేక్షణలో నిర్వహించారు. ఇందులో నాలుగు జిల్లాల అభ్యర్థులు పాల్గొన్నారు. వ్రాతలో ఉత్తీర్ణులైన 45 మందికి డ్రిల్, ఆయుధ వినియోగం, నేరస్థల పరిశీలనపై ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచినవారు ఎస్సై శిక్షణకు ఎంపిక కానున్నారు.