నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టం : బిపిన్ వర్గీస్

నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టం : బిపిన్ వర్గీస్

BHNG: నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ బిపిన్ వర్గీస్, మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం బీబీనగర్ ఎయిమ్స్‌లో 60 మంది నర్సింగ్ అధికారులకు తల్లిపాల ప్రాముఖ్యతపై వర్క్ షాప్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. తల్లీబిడ్డల శ్రేయస్సుకు తల్లిపాల వినియోగం ఎంత అవసరమో వివరించారు.