ప్లాట్, ఇల్లు కొంటున్నారా.. హైడ్రా హెచ్చరిక

ప్లాట్, ఇల్లు కొంటున్నారా.. హైడ్రా హెచ్చరిక

HYD: నగరంలో ప్లాట్, ఇంటి స్థలం కొనేముందు పూర్తిగా విచారించి, అన్నీ సరిగా ఉంటేనే ముందుకెళ్లాలని హైడ్రా సూచించింది. చెరువు FTL పరిధిలో ఏమైనా ఉందా? అనుమతి పొందిన లే అవుట్ అయినా.. ఇంటి నంబరు, బై నంబర్లతో అమ్ముతున్నప్పుడు మరింత అప్రమత్తంగా పరిశీలించి కొనుగోలు చేయాలని పేర్కొంది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ హెచ్చరికలు జారీ చేసింది.