పాలకుర్తి సోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా శనివారం దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం వాయనంగా అర్చకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ బాబు, సూపరిండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.