ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మన అందరి బాధ్యత: ఆర్డీవో
NLR: ఆత్మకూరు డివిజన్‌లోని సంగం మండల కేంద్రంలో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో బీ. పావని పాల్గొన్నారు. ఉదయం 7కి MRO సోమ్లా నాయక్ సిబ్బందితో కలిసి సంగం మండల కేంద్రంలో కొందరు లబ్ధిదారులకు వారి ఇళ్లకు వెళ్లి ఆర్డీవో పెన్షన్లను అందించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 1వ తేదీ లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ అందించాలన్నారు.