విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. తప్పిన ప్రమాదం
KMR: ఎల్లారెడ్డి మండలంలోని అజామాబాద్ గ్రామ సమీపంలో మంగళవారం ఓ కారు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఎదురుగా సైకిల్‌పై వస్తున్న బాలుడిని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, స్తంభం విరిగి ట్రాన్స్‌ఫార్మర్ కిందపడింది.