బైక్ మెకానిక్స్‌కు పోలీసులు అవగాహన

బైక్ మెకానిక్స్‌కు పోలీసులు అవగాహన

VZM: విజయనగరం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో బైక్‌ మెకానిక్స్‌, టూ వీలర్‌ స్పేర్‌ పార్ట్స్‌ విక్రేతలతో పోలీసులు శుక్రవారం అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. సైలెన్సర్‌ మార్పులు, దొంగిలించిన వాహనాల కొనుగోలు, సైబర్‌ నేరాలు, మద్యం సేవించి వాహనం నడపడం (డ్రంకెన్‌ డ్రైవ్‌), సీసీ కెమెరాల ప్రాముఖ్యత వంటి అంశాలపై సీఐలు సూరినాయుడు, శ్రీనివాసరావు అవగాహన కల్పించారు.