రీల్స్ కోసం నీటిలోకి దిగి గల్లంతైన యువకులు

రీల్స్ కోసం నీటిలోకి దిగి గల్లంతైన యువకులు

AP: కడపలోని వాటర్ గండిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఇన్‌స్టా రీల్స్ కోసం ఐదుగురు యువకులు వాటర్ గండి వెళ్లారు. వీరిలో ముగ్గురు యువకులు నీటిలోకి దిగి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిలో అరుణ్ అనే యువకుడిని స్థానికులు కాపాడారు. రోహిత్, నరేష్ అనే మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.