'పంచాయతీ ఎన్నికలను త్వరగా నిర్వహించాలి'

MNCL: పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం త్వరగానే నిర్వహించాలని సీపీఎం జన్నారం మండల కార్యదర్శి కానికారపు అశోక్ కోరారు. మంగళవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.