గాలి దుమారానికి పడిపోయిన చెట్లు

గాలి దుమారానికి పడిపోయిన చెట్లు

MDK: తూప్రాన్ మండలంలో సోమవారం రాత్రి గాలి దుమారానికి భారీ ఎత్తున చెట్లు కూలిపోయాయి. మండలంలోని ఘనపూర్, యావపూర్ గ్రామాలలో రాత్రి 11 గంటల సమయంలో గాలి దుమారం రావడంతో భారీగా చెట్లు పడినట్లు గ్రామస్తులు తెలిపారు. తూప్రాన్ - గజ్వేల్ రోడ్డుపై చెట్లు విరిగిపడడంతో పోలీసులు జెసిబి యంత్రం సహాయంతో తొలగించారు.