VIDEO: ఆర్మూర్ పట్టణంలో పరిసరాలు పరిశుభ్రం

NZB: ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కాలనీ 2వ వీధిలో పిచ్చి మొక్కలు తొలగించి చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు. అనంతరం కాలనీలో ఉన్న మురుగు కాలువలు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.