బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామానికి చెందిన చల్లా ఆదినారాయణ సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వారి స్వగృహానికి చేరుకుని ఆదినారాయణ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.