VIDEO: జిల్లాలో ఆదివాసి యువత కవాతు

VIDEO: జిల్లాలో ఆదివాసి యువత కవాతు

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆదివాసీ యువత కవాతు ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ జాబితా నుంచి తొలగించాలని కవాతులో పాల్గొన్నవారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుసేన్ నాయక్‌పై అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు.