ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO

MBNR: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (DMHO) డా. కృష్ణ బుధవారం మహబూబ్ నగర్ రూరల్ మండలం ఎదిరలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నమోదైన డెంగీ కేసుల వివరాలు, ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసులు, డ్రై డే కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేశ్ చంద్ర, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.