డ్రైనేజీ కాలువ నీటితో విద్యార్థులు ఇబ్బందులు

KDP: ముద్దనూరు మండల కేంద్రంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాల వద్దనున్న డ్రైనేజ్ కాలువ నుండి నీరు పాఠశాల లోపలి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి మురికి నీరు పాఠశాలలోకి వస్తున్నాయన్నారు. మురికి నీటి నుంచి దుర్వాసన రావడంతో క్రిములు, పందులు అక్కడ వస్తున్నాయని అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు వాపోయారు.